వైరల్: ఏం రెసిపీరా నాయనా? దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఏమిటో?
ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వంటకాలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం. ఈ క్రమంలో కొన్ని వీడియోలను చూసినప్పుడు నోట్లో నోరు వూరుతోంది. మరికొన్నిసార్లు మాత్రం ఇదేం వంటకంరా.. నాయనా? చూస్తుంటేనే వాంతి వస్తోంది.. ఇక తింటే పరిస్థితి ఏమిటో? అని అనిపించకమానదు. ఇలాంటి విచిత్ర వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు తెగ వైరల్ అవుతుంటాయి. కాగా తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటజన్లు అవాక్కవుతున్న పరిస్థితి ఉంది.
ఇక దానిని చూసిన నెటిజనం ''ఏం కలుపుతున్నవురా నాయన? దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో డైరెక్ట్ గా చూడాలని ఉంది!'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో తయారయ్యే రెసిపీ. అటుకులతో చేసిన వివిధ వంటకాలు మిశ్రమం ఇది. ఆయా ప్రాంతాల్లో కొందరు చిరు వ్యాపారులు ఇదే అటుకుల్లో ఏవోవే కలిపి చిత్రవిచిత్రమైన వంటకాన్ని చేస్తుంటారు. ఇలాంటి అటుకుల వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకసారి మీరు కూడా దానిని చూసి తరించండి.