పాపం.. దోమను చంపబోయి.. బొక్క విరగ్గొట్టుకున్నాడు?
అయితే మనుషులు ఎంతలా దూరంగా ఉండాలని భావించిన.. అటు దోమలు మాత్రం మనుషులకు దగ్గరగా రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అయితే మనుషులపై దండయాత్రకు దిగాయేమో అన్నట్లుగా కుడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో దోమల బారి నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి. దోమల బ్యాట్లు, క్రీమ్లు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇక ఎవరికీ నచ్చిన ప్రోడక్ట్ వాళ్లు వాడుతూ దోమల బారి నుంచి ఇక దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి.
అయితే ఇక్కడొక వ్యక్తి మాత్రం దోమ కుడుతుందని ఏకంగా దానిపై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ దోమ దెబ్బకు చివరికి అతని కాలు ఎముక విరిగింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో ఏముందంటే.. ఒక వ్యక్తి కాలుపై దోమ కుడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గమనించిన వ్యక్తి.. స్తుతితో గట్టిగా కొట్టాడు. కానీ అతను కొట్టేసరికి దోమ అక్కడి నుంచి ఎగిరిపోయింది. కానీ కాలు బొక్క మాత్రం విరిగి పోయింది. ఎక్స్ రే ఫోటో కూడా కనిపిస్తుంది. ఇలా దోమను చంపబోయి చివరికి కాలు విరగ్గొట్టుకున్నాడు సదరు వ్యక్తి.