ఈ ప్రాంత ప్రజలకు భారీ వర్షం.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ..!!
ముఖ్యంగా రేపటి రోజున కూడా ఉత్తర కోస్తా యానంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.. కాగా పలుచోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం విషయానికి వస్తే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇదిలా ఉంటే దక్షిణకొస్తాలో కూడా మూడు రోజులు పాటు వర్షాల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లుల కురుస్తున్నట్లు సమాచారం.
ఇక రాయలసీమ విషయానికొస్తే ఈ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. అయితే కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ కేంద్రం పలు విధాలుగా కనుగొని హెచ్చరించడం జరిగింది. ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ .... తెలంగాణకు "రెయిన్ అలర్ట్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ " అంటూ...వాతావరణ శాఖ హెచ్చరించింది. 13, 14 తేదీల్లో తెలంగాణలో పలు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.