రైతులకు గుడ్ న్యూస్ ..రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు..!!

Divya
గత కొద్ది రోజులుగా వర్షాలు పడకుండా ఉండడంతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కానీ తాజాగా వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ "డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" తెలియజేస్తున్నారు.అయితే ఈ మేరకు నిన్నటి రోజున ఒక ప్రకటనను సైతం విడుదల చేయడం జరిగింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందట .


ఈనెల 3 న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, గుంటూరు తో పాట రాయలసీమలో పలు ప్రాంతాలలో కూడా  అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం  ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు..ఈ నెల 4 న బాపట్ల, నెల్లూరు,వైయస్సార్ మొదలగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. 5న తేదీన పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి,కాకినాడ,ఏలూరు,బాపట్ల తదితర ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయట అయితే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.

 ఇదిలా ఉండగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుందట..  ఏపీలో మూడు రోజులపాటు కొనసాగుతూ ఉండడం వల్ల..భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందువలన రైతులు వ్యవసాయ పనులను సాయంత్రం వేళ ఎక్కువగా పొలాలలో ఉండకపోవడమే మంచిదట. ముఖ్యంగా చెట్ల కింద నిల్చోరాదని హెచ్చరికలు జారీ చేయనున్నారు. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు  తెలిపారు.కాగా ప్రజలు అందరూ  అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: