
ఆవు గిన్నిస్ బుక్ రికార్డు.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?
ఘోస్ట్ ఏంటి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం ఏంటి ఎక్కడైనా దెయ్యం రికార్డు సృష్టిస్తున్న అని అంటారా.. ఘోస్ట్ అనగానే దయ్యం అనుకున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఘోస్ట్ అనేది ఇక్కడ ఒక ఆవు పేరు. ఏకంగా 60 సెకండ్లలో పది విన్యాసాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకుంది ఆవు. యూఎస్ఏ లోని నేబ్రాస్కాలు ఇక ఈ ఘటన జరిగింది. కేవలం 60 సెకండ్లలో 10 విన్యాసాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది ఆవు. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.
ఇంతకీ ఆవు ఏం చేసిందంటే.. మేఘాన్ రీమాన్ అనే మహిళ సాయంతో ఘోస్ట్ అనే ఆవు స్టే ఇన్ ఏ ప్లస్, బెల్ టచ్, ఫోన్ నోట్ ఇలా పది విన్యాసాలు చేసి చూపించింది. అయితే ఈ ఆవుకి కాస్త స్టేజ్ ఫియర్ ఉందట.. అయినప్పటికి ఇక నిమిషంలోనే అత్యధిక విన్యాసాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది అని ఈ ఆవు యజమాని తెలిపారు. అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఆవు పేరు చేరడం ఎంతో సంతోషంగా ఉంది అంటే చెప్పుకొచ్చాడు. ఆవు పెరిగే కొద్దీ ఎన్నో అంశాలను చేయగలదని.. రంగుల మధ్య తేడాను కూడా గుర్తించగలదు అంటూ సదరు ఆవుకి సాయపడ్డ మేఘాన్ రియాన్ అనే మహిళ చెప్పుకొచ్చారు.