కొండెక్కిన కోడి ధర.. సామాన్యులకు షాకె..?

Divya
ఈ మధ్యకాలంలో మళ్లీ ఎండలు తీవ్రంగా పెరిగిపోవడంతో ఎండలతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో కొంతమంది బయటికి వచ్చేందుకు కూడా జంకుతున్నారు ఒకవైపు పెరిగిన ఉష్ణోగ్రతలు మరొకవైపు ఉక్కపోతతో ప్రజలు చాలా సతమతమవుతున్నారు. ఎన్నో ప్రాంతాలలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పౌల్ట్రీ రంగం చాలా కుదేలవుతోంది. దీని కారణంగానే ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో ఖర్చులు పెరగడంతో చికెన్ ధరలు సైతం సామాన్య ప్రజలు సైతం చికెన్ తినాలంటే భయపడేలా పెరిగిపోయాయి.

కోడి మాంసం ధరలు భారీగా పెరగడంతో తెలంగాణలో గత మూడు రోజులుగా లైవ్ కోడి ధర మాత్రం కిలో రూ 195 రూపాయలకు పైగా చేరినట్లు తెలుస్తోంది. మాంసం స్కిన్ తో రూ.290 రూపాయల చేరినట్లుగా తెలుస్తోంది ఒకవేళ స్కిన్ లెస్ అయితే మాంసం కిలో రూ.320 అన్నట్లుగా తెలుస్తోంది అయితే ఏప్రిల్ కిలో చికెన్ ధర రూ.150 రూపాయలు మాత్రమే ఉండగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే ధర మరింత రెట్టింపు అయ్యింది. దీనికి కారణం ఉత్పత్తి తగ్గడం వల్ల డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో కోడి రేటు మరింత పెరిగినట్లు చికెన్ షాప్ లో యాజమాన్యులు తెలియజేయడం జరుగుతోంది.

సాధారణంగా కోడి పిల్ల పెద్దగా ఎదగడానికి దాదాపుగా 40 రోజులపాటు సమయం పడుతుందట. ఇప్పుడు ఎండల నేపథ్యంలో 50 నుంచి 60 రోజుల సమయం పడుతుంది అని అయితే భారీ ఉష్ణోగ్రతల కారణంగా చాలా కోళ్లు కూడా ఈ వేడికి మరణిస్తున్నాయని పౌల్ట్రీ యజమానులు తెలియజేస్తున్నారు. మరొకవైపు దారుణమైన రేట్లు పెరగడంపై కూడా ఈ ప్రభావం ప్రజల పైన పడుతోంది అంటూ పలువురు తెలియజేస్తున్నారు. చికెన్ ధరలు తగ్గడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా షాపుల యజమానులు తెలియజేస్తున్నారు వాతావరణం చల్లబడితేనే పరిస్థితులు మారుతాయని హెచ్చరిస్తున్నారు పౌల్ట్రీ యాజమాన్యాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: