ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. టాప్ కాలేజీల లిస్ట్..!

Divya
ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యను అందిస్తున్న విద్యాసంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ వరసగా ఇప్పుడు ఐదవ ఏడాది కూడా తన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐ ఐ ఎస్ సీ బెంగళూరు మొదటి స్థానాన్ని ఆక్రమించడం గమనార్హం. ఇకపోతే ఈ నేపథ్యంలోనే సోమవారం దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది.
దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ వరుసగా ఐదవ ఏడాది మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐ ఐ ఎస్ సీ బెంగళూరు మొదటి స్థానాన్ని మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐ ఐ ఎస్ సీ రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. మరొకవైపు ఐఐటి మద్రాస్ అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో వరుసగా 8 వ సారి అగ్రస్థానాన్ని సంపాదించడం హర్షదాయకం. ఇక ఆ తర్వాత స్థానాలలో ఐఐటి ఢిల్లీ , ఐఐటి బాంబే స్థానాలను కైవసం చేసుకున్నాయి. పరిశోధన విభాగంలో ఐ ఐ ఎస్ సీ బెంగళూరు ఉత్తమమైన సంస్థగా టాప్ ప్లేస్ లో నిలిచింది.
మరొకవైపు ఐఐటి కాన్పూర్ ఆవిష్కరణకు అత్యుత్తమ ర్యాంకును సంపాదించుకోవడం గమనార్హం.  అలాగే ఫార్మసీ రంగంలో హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే ఫార్మా లో జామియా హం దార్ద్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకోగా బిట్స్ పిలాని మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా దేశంలో విద్యార్థులు ఉత్తమ ఐఐటి, ఐఐఎస్సి, ఇంజనీరింగ్ , ఫార్మా కాలేజీల కోసం వెతుకుతున్నట్లయితే ఈ జాబితా ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఇందులో మీకు నచ్చిన కోర్స్ లో మీకు నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవచ్చు అని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: