ఋతుపవనాలు వచ్చేది అప్పుడే.. రైతులు అలర్ట్..!!

Divya
ఈ మధ్యకాలంలో వర్షాలు వాతావరణం తో సంబంధం లేకుండా ఎలా పడితే అలా వస్తూ ఉన్నాయి. దీంతో ఎంతో మంది రైతులు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఈ ఏడాది రుతుపవనాలు జూన్ మూడవ తేదీ లేదా నాలుగవ తేదీలో కేరళ ప్రాంతానికి తాకవచ్చని అరేబియా సముద్రంలో తుఫాను కూడా ఏర్పడవచ్చు అని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇక ఈ రుతుపవనాలు జూన్ మూడవ వారంలో కాస్త ఆలస్యం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు.
అయితే అలా  ఆలస్యం రావడానికి గల కారణాలు రుతుపవనాలను తీసుకువచ్చే  గాలులు వెస్టర్లీస్ తుఫాను వ్యవస్థను అధికమించే బలంగా ఉండడం వల్ల ఇలా జరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఫలితంగా జూన్ లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ కంటే తక్కువ నమోదు లో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.. కానీ రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత జూన్ 3 మరియు నాలుగో వారంలో బాగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఋతుపవనాల రాక కాస్త ఆలస్యమే అవకాశం ఉన్నందున రైతులు తమ ప్రణాళికను జూన్ మూడో వారంలో వాయిదా వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది.

భారతీయ వాతావరణ శాఖ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ రానున్న 48 గంటలలో రుతుపవనాలు మాల్దీవులు కొరియాన్ ప్రాంతం మరియు దక్షిణ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలలో కదలడానికి అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో మూడో వారంలో రుతుపవనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతులు పంటను వేసుకోవాలి అంటే మరొక కొద్ది రోజులు ఆలస్యం అవుతుందని తెలియజేస్తున్నారు. దీంతో పంట వేసేందుకు సరిపడు ధాన్యాన్ని ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ వారు.. కేవలం వర్షాల ఆధారంగా పండించే రైతులు పెరుగుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: