క్రియేటివిటీ పీక్స్.. షిప్ లో క్రికెట్.. బంతి సముద్రంలో పడకుండా?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న ఆదరణ అంతకంతకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే క్రికెట్ ని ఎక్కడైనా ఆడొచ్చు. ఏకంగా అంతర్జాతీయ మ్యాచుల కోసం ఏర్పాటు చేసిన మైదానంలోనే కాదు ఇక చిన్న గల్లీలో సైతం క్రికెట్ ఆటను ఆడవచ్చు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అలా చిన్న చిన్న మైదానాల్లో లేదా చిన్న గల్లీలలో క్రికెట్ ఆడటం చూసాము.. విన్నాము. కానీ ఏకంగా సముద్రంలో దూసుకుపోతున్న షిప్ లో క్రికెట్ ఆడటం గురించి ఎప్పుడైనా విన్నారా.

 సముద్రంలో ముందుకు వెళ్తున్న షిప్ లో క్రికెట్ ఆడటం ఏంటి.. ఇది వినడానికే కాస్త విచిత్రంగా ఉందే అని అంటారు ఎవరైనా. అయితే ఒకవేళ ఇలా సముద్రంలో వెళ్తున్న షిప్ లో క్రికెట్ ఆడిన బంతి సముద్రంలో పడిపోతే ఎలా.. మళ్లీ బంతిని ఎవరు తీసుకువస్తారు అని అనుమానం కూడా మీకు వచ్చే ఉంటుంది. ఇలా షిప్ లో ఆ క్రికెట్ ఆడుతున్న వారు బంతి సముద్రంలో పడిపోకుండా ఉండేందుకు ఒక సరికొత్త ఆలోచన చేశారు.  ఏకంగా బంతికి తాడు కట్టి షిప్ లో క్రికెట్ ఆడారు ఇక్కడ కొంతమంది యువకులు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇది క్రియేటివిటీకే పీక్స్ అని అనిపిస్తుంది కదా.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే తాడు కట్టి ఉన్న బంతిని ఒక వ్యక్తి బౌలింగ్ చేయగా.. ఇక అక్కడే బ్యాట్ పట్టుకున్న మరో వ్యక్తి దానిని షాట్ కొట్టాడు. అయితే బంతి నేరుగా వెళ్లి సముద్రంలో పడిన ఇక తాడు చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ దాడితో బంతిని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చేలా ఏర్పాటు చేసుకొని మరి క్రికెట్ ఆడారు. ఇక ఈ వీడియో చూసి క్రికెట్ ఫాన్స్ అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి గురు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: