హార్ట్ మెల్ట్ చేసే వీడియో.. తొలిసారి తండ్రిని కలిసిన బేబీ గొరిల్లా.. రియాక్షన్ చూడండి?
అందుకే గుండెల్లో కొండంత ప్రేమ ఉన్న పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తూ.. కాస్త కఠినంగానే ఉంటాడు తండ్రి. ఇక పిల్లల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే అలాంటి తండ్రి బిడ్డను తొలిసారి చూసినప్పుడు ఇక ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకున్నప్పుడు.. కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చిన రాదు. మాటలో వర్ణించడం కూడా కష్టం. ఇక ఇలాంటి సంతోషకరమైన, ఉద్వేగభరీతమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక బేబీ గొరిల్లా తన తండ్రిని మొదటిసారి చూసింది.
ఈ క్రమంలోనే బేబీ గొరిల్లా తండ్రి గొరిల్లా ప్రవర్తించిన తీరు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఇక తండ్రి గొరిల్లా అందరి తండ్రి లాగానే లోపల సంతోషాన్ని దాచుకొని కాస్త గంభీరంగానే చూస్తుంది. ఇక బేబీ గోరిల్లా ఇక తండ్రిని మొదటిసారి చూసిన ఉద్వేగాన్ని ఆపుకోలేక చేతులతో టచ్ చేస్తూ తెగ ఆనందపడిపోయింది. ఇక ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక పిల్ల గొరిల్లా తన తండ్రి ముఖాన్ని మెల్లగా తడుముతూ ఉద్వేగానికి గురవుతున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరికి హార్ట్ మెల్ట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.