
కార్ ఇంజన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే మైండ్ బ్లాక్?
అయితే ఇటీవల కాలంలో పామును డైరెక్ట్ గా చూడటానికి ఎంతో భయపడిపోతున్న జనాలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే వీడియోల ద్వారా చూడటానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. దీంతో ఇంటర్నెట్ లోకి పాములకు సంబంధించిన వీడియో ఏదైనా వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా విషపూరితమైన పాములు ఎలా వాహనాల్లోకి దూరుతున్నాయి. ఇక వాటి జీవన శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి.
ఇకపోతే ఇక్కడ పాము కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా కారు ఇంజన్లో చుట్టుకొని ఉన్న ఒక భారీ నాగుపామును చూసి నేటిజన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది అని చెప్పాలి. 9 అడుగుల పొడవున్న నాగుపాము కారు ఇంజన్లో ఎంచక్కా సేద తీరుతూ ఉండడం వైరల్ గా మారిపోయిన వీడియోలో కనిపిస్తుంది. అయితే కారు ఇంజన్ నుంచి వింత శబ్దాలు రావడంతో ఏంటా అని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే గంటన్నర కష్టపడి ఆ పామును అక్కడ నుంచి బయటికి తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిగా సంఘటన స్థలానికి చేరుకున్నఅధికారులు పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసారు. ఈ ఘటన థాయిలాండ్ లోని సాంగ్ క్లా ప్రావిన్స్ లో చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది.