వైరల్ : ఇంతకీ అదేంటి.. పిల్లా.. లేక పులా?

praveen
ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు ఇంకా మానవుడు కనుక్కునే దశలోనే ఉన్నాడు. అవి మన కంటికి కనిపిస్తే తప్ప నమ్మలేకుండా ఉంటాయి కొన్ని విషయాలు. అలాంటి ఒక ప్రకృతి సృష్టించిన అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భరత్ లోని లడఖ్ ప్రాంతంలో ఎంతో అందమైన, అరుదైన మరియు అద్భుతమైన ఒక జంతువు కనిపించింది. ఈ జంతువు యొక్క వీడియో తీసిన ఒక ఐఏఎస్ అధికారి అయినా పర్వీన్ కస్వల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు. సదరు అధికారి షేర్ చేసిన వీడియో కి కొన్ని లక్షల వ్యూస్ రావడం తో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
కేవలం 45  సెకండ్స్ నిడివి తో ఉన్న ఈ వీడియో లో ఆ జంతువు ని చూసి మిగతా జంతువులు అరుస్తూ ఉండటం మనం గమనించ వచ్చు. ఇక ఈ వీడియో షేర్ చేసి దాని పేరు ఏంటో, ఎలాంటి జంతువో ఊహించి దాని పేరును కామెంట్ చేయాలనీ  ఐఏఎస్ ఆఫీసర్ పర్వీన్ కస్వల్ కోరగా, చాల మంది దానిని సివంగి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు ఇది నిజంగా అద్భుతంగా ఉంది అంటూ చెప్తున్నారు.
లడఖ్ ప్రాంతం లో ఇలాంటి ఒక అరుదైన జంతువు కనిపించడం పట్ల అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇలా అరుదైన జాతికి చెందిన జంతువులు కనిపించడం ఇదేమి మొదటి సారి కాదు గతంలో కూడా అనేక సార్లు లెక్కల్లో కనిపించని కొన్ని జంతువులు సంచరిస్తూ కనిపించాయి. అయితే అవి అంతరించి పోయే సమయంలోనే ఇలా బయటకు వచ్చి ఆహరం కోసం వెతుకుంటూ ఉంటాయి అని చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం వారు ఈ జంతువు కు సంబదించిన వివరాలను కనుక్కునే పనిలో పడ్డారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి అందాలను అందరు చూస్తున్నారు. లేకపోతే ఎక్కడో లడఖ్ లో తిరిగిన అరుదైన జంతువును లక్షల మంది చూసే అవకాశం లభించడం కష్టం కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat

సంబంధిత వార్తలు: