మాకు నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలి: పాకిస్తాన్ వ్యక్తి

Purushottham Vinay
ఇక ఇప్పుడు చాలా దారుణంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఇండియా విలువ ఏంటో తెలుస్తోంది. మాకు నరేంద్రమోదీ లాంటి ప్రధాని కావాలంటూ అక్కడి ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు.రీసెంట్ గా పాకిస్తాన్ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని '' పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఖచ్చితంగా ఇండియాకు వెళ్లాలి'' అని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించిన సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.తమకు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, జెనజీర్, ముషారఫ్ తమకు వద్దని  కేవలం నరేంద్ర మోదీనే కావాలంటూ ఆ యువకుడు చెప్పిన మాటలు ఇటు ఇండియాలో, అటు పాక్ లో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ఇంకా అలాగే పాక్ ప్రధాని షెషబాజ్ షరీఫ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోదీ పాకిస్తాన్ ప్రధాని అయితే పాక్ ప్రజలకు కూడా తక్కువ ధరకే ఆహార పదార్థాలు ఇంకా కూరగాయలు దొరికేవని అన్నాడు. తాను పాకిస్తాన్లో పుట్టకుంటే బాగుండేదని నిరుత్సాహంతో ఆ వ్యక్తి చెప్పడం మనం ఆ వీడియోలో చూడవచ్చు.


మోదీ మనకన్నా చాలా గొప్పవాడు, ఆయన ప్రజలను చాలా గౌరవిస్తారు. పాకిస్తాన్ కు కూడా నరేంద్ర మోదీ ఉంటే అసలు నవాజ్ షరీఫ్, బెనజీర్చ ఇమ్రాన్ అవసరం లేదని, మనకు కావాల్సినవి ప్రధాని మోదీ మాత్రమే తీర్చుతారని చెప్పారు. ఇండియా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, కానీ పాకిస్తాన్ ఎక్కడ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇక మోదీ గొప్పవ్యక్తి అని, చెడ్డ వ్యక్తి కాదని అతడు అన్నాడు. భారతీయులకు కిలో టొమాటోలు రూ. 20కి ఇంకా కిలో చికెన్ రూ. 150కి లభిస్తున్నాయని.. మనం మాత్రం రాత్రి పూట పిల్లలకు సరిగ్గా ఆహారం ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంగా ఉంటే మనం కూడా భారతీయ ముస్లింల లాగే కలిసి మెలసి ఉండేవాళ్లమని దీంట్లో తేడా ఏముంటుందని ఆ వ్యక్తి ప్రశ్నించారు. భారత దేశంతో స్నేహం చేస్తే టొమాటోలు ఇంకా చికెన్ చవకగా లభిస్తాయని పాక్ ప్రభుత్వానికి సూచించాడు. పాక్, ఇండియా ఒకే దేశంగా ఉంటే చాలా బాగుండేది అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: