చింపాంజీ చేసిన పనికి.. నెటిజన్స్ ఫిదా?

praveen
మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో కూడా మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాటి మనుషులు కనిపిస్తే ఒకప్పుడు నవ్వుతూ పలకరించేవారు. కానీ ఎప్పుడు మాత్రం పైకి నవ్వుతూ పలకరిస్తున్న లోపల మాత్రం ఎన్నో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు ఓర్వలేని పరిస్థితి నేటి రోజుల్లో మనుషుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి. అలాంటిది ఇక సాటి మనుషులకు సహాయం చేసే గుణం ఎక్కడ కనిపించడం లేదు. అయితే అయితే ఇలా మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు అదే మానవత్వాన్ని మరిచిపోతూ ఉంటే అటు అడవి జంతువులు మాత్రం ఇక జాతి వైరంతో సంబంధం లేకుండా స్నేహభావంతో మెలుగుతూ ఉండడం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగు లోకి వస్తుంది.

 నేటి రోజుల్లో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే జంతువులకు సంబంధించిన వీడియోలు ఎంతలా ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొన్ని వీడియోలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంటే మరికొన్ని వీడియోలు అందరికీ ఒక ప్రత్యేకమైన మెసేజ్ ను ఇస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వీడియో మనుషులు అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంది అని చెప్పాలి. సాటి మనుషుల విషయంలో ఎప్పుడు దయా గుణంతోనే ఉండాలి అన్న విషయాన్ని ఇక ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. కొంతమంది నేటిజన్స్  ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

 సాధారణంగా కోతులు చింపాంజీలు అటు ఎక్కువగా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం మనుషుల హావభావాలను పలికించే చింపాంజీలు అటు మానవత్వం విషయంలో మాత్రం మనుషుల కంటే గొప్పగా ఆలోచిస్తున్నాయి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక చింపాంజీ నీళ్లపై ఉన్న చెక్కలతో కట్టిన వంతెన పై కూర్చుని ఉంది. అయితే దాని కింద ఉన్న చేపలకు ఎంతో ప్రేమగా ఆహారాన్ని అందిస్తుంది అని చెప్పాలి. ఇక ఇలా ఆహారాన్ని అందించిన తర్వాత నేను ఎలా చేశానో చూసారా అన్నట్లుగానే కెమెరా వైపు ఒక లుక్ ఇచ్చింది.  ఇది అందరిని ఫిదా చేసేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: