వైరల్ : నిజంగా.. ఈ పోలీస్ అన్నకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే?

praveen
సాధారణంగా పోలీసులు ఏం చేస్తూ ఉంటారు. నేరాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు విధినిర్వహణలో నిమజ్జనం అవుతూ ఉంటారు. ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా పోలీసులు ఏం చేస్తారు అంటే ఎవరైనా సరే ఇదే చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం పోలీసు వృత్తిలో కొనసాగుతున్నవారు ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కేవలం మనుషులను కాపాడటమే కాదు మూగజీవాలకు సైతం సహాయం చేస్తూ సభ్య సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఇటీవల కాలంలో నేను బాగుంటే సరిపోతుంది. నా కుటుంబం సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి అని ప్రతి ఒక్కరు స్వార్ధంగా ఆలోచిస్తున్న సమయంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఏకంగా ఎన్నో విషయాల్లో మానవత్వాన్ని చాటుతూ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇటీవలే బెంగళూరుకు చెందిన ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి చేసిన పని కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నేటిజన్స్  అందరూ కూడా సదురు పోలీస్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.


 బెంగళూరులోని రాజాజీనగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు సురేష్. ఇటీవల తన ప్రాణాలను పణంగా  పెట్టి మరీ మొబైల్ టవర్ లో ఇరుక్కుపోయిన ఒక పక్షిని రక్షించాడు. ఇక ఈ విషయాన్ని ట్రాఫిక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ట్విట్టర్లో  పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది. ఒక పక్షిని కాపాడేందుకు ట్రాఫిక్ పోలీస్ సురేష్ చూపించిన తెగువకు అటు నేటిజన్స్  అందరూ ఫిదా అవుతున్నారు  అతనిపై ప్రశంసల కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: