నాగుపాముపై పాయింట్ బ్లాక్ రేంజ్ కాల్పులు.. అంతలో ట్విస్ట్?

praveen
ఇటీవల కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నేరుగా కళ్ళ ముందు పాము ప్రత్యక్ష అయినప్పుడు చూడటానికి భయపడిపోయే జనాలు.. అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలు చూసేందుకు మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ వీడియోల ద్వారా పాము కదలికలు ఎలా ఉంటాయి. అది ఎలా దాడి చేస్తుంది. పాము వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎంతో మంది నేటజన్స్ ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలోకి పాములకు సంబంధించిన వీడియోలు ఏమైనా వెలుగులోకి వచ్చాయంటే చాలు అవి వైరల్ గా మారిపోతూ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా నాగుపాము కి కాస్త కోపం ఎక్కువగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. దాని జోలికి వెళ్తే దాడి చేసి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు అని అంటూ ఉంటారు. ఇక్కడ ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం నాగుపాముకి ఎంత కోపం ఉంటుంది అన్నది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఏకంగా ఇక్కడ ఒక వ్యక్తి పాము పై పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపాడు. దీంతో రెండు బుల్లెట్ల వరకు ఓపికగా చూసిన పాము తర్వాత చిర్రె ఎత్తుకొచ్చి అతని మీదికి దూసుకు వచ్చింది.

 ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటూ ఒక వ్యక్తి కారులో కూర్చొని ఉన్నాడు. అయితే అతని కారు ముందు ఒక పాము పడగవిపి బుసలు కొడుతుంది. అయినప్పటికీ సదర వ్యక్తి మాత్రం తన దగ్గర గన్ ఉంది అనే ధైర్యంతో కోబ్రాకి పాయింట్ బ్లాక్ లో గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే రెండు రౌండ్లు కూడా కాల్చాడు.  కానీ బుల్లెట్లు గురి తప్పాయి. ఇంకేముంది కోబ్రాకి కోపం వచ్చింది. దీంతో వేగంగా అతని వైపు దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన  సదరు వ్యక్తి వెంటనే కార్ డోర్ క్లోజ్ చేయడమే కాదు ఇక విండో కూడా క్లోజ్ చేసుకుని కారులో దాక్కున్నాడు. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కోబ్రా తో ఫైట్ కి దిగాలనుకుంటే తుపాకీతో దిగొద్దు అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: