ఘనంగా పెళ్లి వేడుక.. అంతలో అనుకోని అతిధి.. భయంతో అందరూ పరుగులు?

praveen
సాధారణంగా వివాహ వేడుకలు జరుగుతున్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైన చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వధూవరులు ఎంతో గ్రాండ్ గా అటు పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇవ్వడం లాంటిది కూడా సోషల్ మీడియా  లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయి. ఇక మొన్నటికి మొన్న ఒక యువకుడు హీరో లాగా ముక్కు ముఖం తెలియని వారి పెళ్లికి వెళ్లి చివరికి ప్లేట్లు కడిగిన ఘటన కూడా అందరిని అవాక్కయ్యేలా చేసింది.


 ఇక్కడ ఒక వివాహ వేడుకకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారి పోతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. సాధారణం గా వివాహ వేడుకకు కొన్ని కొన్ని సార్లు అనుకోని అతిథులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడూ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక ఎద్దు వివాహ వేడుక వద్దకు ఎంట్రీ ఇచ్చింది. ఏకం గా గేటును బద్దలు కొట్టుకొని మరి పెళ్లి మండపం లోకి దూసుకు వచ్చింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఆ ఎద్దును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.


 అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏకంగా ఆ ఎద్దును బయటికి పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అది భయపడకపోగా ఏకంగా అతనిపై దాడి చేసేందుకు దూసుకోవచ్చింది. దీంతో ఏమీ చేయలేక బతుకు జీవుడా అంటూ ఇక ఎద్దు నుంచి తప్పించుకునేందుకు సదరు వ్యక్తి పరుగులు తీశాడు  ఇక అక్కడ ఉన్న విందు వద్దకు కూడా దూసుకు వెళ్లిన ఎద్దు హంగామా సృష్టించింది అని చెప్పాలి  ఇక కాసేపు ఇలా రచ్చ రచ్చ చేసిన ఎద్దు ఇక పెళ్లి మండపం నుంచి వెళ్లిపోవడంతో అక్కడున్న వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: