ఉత్సాహంగా డాన్స్ చేశాడు.. కానీ అంతలోనే విషాదం?
అంతే కాదు ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణాలపై మరింత తీపి పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు. ఇక ఉన్న ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తే బెటర్ అంటూ భావిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా వారణాసిలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక పక్కన ఉన్నవారు అతని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఏకంగా అప్పుడు వరకు ఎంతో సంతోషంగా జోష్ లో డాన్స్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా అక్కడే కుప్ప కూలిపోయాడు. దీంతో పక్కనే ఉన్నవారు షాక్ అయ్యారు అని చెప్పాలి. దీంతో ఏం జరిగిందా అని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా గుండెపోటు కారణంగా అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇక పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఇలా చనిపోయిన వ్యక్తిపేరు మనోజ్ విశ్వకర్మ గా గుర్తించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.