ఫ్రస్టేషన్ అంటే ఇదే మరి.. చూస్తే నవ్వు ఆపుకోలేరు?

praveen
ఉరుకుల పరుగులు జీవితంలో ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ లోనే అందరూ బ్రతికేస్తున్నారు . ఈ క్రమంలోనే  చిన్న చిన్న విషయాలకే ఫ్రస్టేషన్ తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఫ్రెస్ట్రేషన్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది ఏకంగా తమ ఫ్రస్టేషన్ తో మిగతా వారికి నవ్వులు పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి.

 ఇలా కొంతమంది వింతగా ఫ్రస్టేషన్ చూపించడం లాంటి వీడియోలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఫ్రస్టేషన్ రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకోకపోవడం.. ఫుల్లుగా ఆకలితో రెస్టారెంట్ కి వెళ్తే ఇక ఫుడ్ లేటుగా డెలివరీ ఇవ్వడం.. ఇలా చిన్నచిన్న కారణాలే కానీ ఫ్రస్టేషన్ మాత్రం పీక్స్ లో ఉంటుంది అని చెప్పాలి. ఇఎక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే మాత్రం ఇక్కడ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఫ్రస్టేషన్ అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తుంది.

 ఒక సెలూన్ షాప్ కి హెయిర్ కటింగ్ కోసం వెళ్తాడు ఒక వ్యక్తి. అయితే హెయిర్ కట్ చేసే వ్యక్తి ఇక ఆ కస్టమర్ జుట్టును తడపడానికి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం ఎక్కడైనా సహజమే. కానీ ఎందుకో అలా వాటర్ కొట్టడం ఆ కస్టమర్ కి మాత్రం చిరాకు తెప్పించింది. వెంటనే తన ముందు బకెట్లో ఉన్న నీటిని ఒక జగ్ తో తీసుకొని తలపై పోసుకున్నాడు. అయితే జుట్టు మొత్తం తడిసి ఉన్న బార్బర్ మాత్రం ఇంకా హెయిర్ ని తడిపేందుకు వాటర్ కొడుతూనే ఉన్నాడు. దీంతో హెయిర్ కట్ చేయించుకునే వ్యక్తి మరోసారి మగ్గుతో తనపై వాటర్ పోసుకున్నాడు. అయినప్పటికీ బార్బర్ మళ్లీ నీళ్లు కొట్టడంతో ఇక ఏకంగా కోపంతో ఊగిపోయి అతనిపై చేయి చేసుకున్నాడు..

Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: