ఓరి నాయనో.. సఫారీ వాహనంలోకి దూకిన సింహం.. చివరికి?

praveen
సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర మృగాలైన పులులు, సింహాలను చూడటానికి ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. ఏకంగా టీవీలో చూసినప్పుడే వణికిపోతూ ఉంటారు. అలాంటిది ఇక నేరుగా చూస్తే అమ్మో ప్రాణాల మీద ఆశలు వదులుకుంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు, సందర్శకులు కొన్ని కొన్ని సార్లు ఏకంగా అడవుల్లోకి వెళ్లి క్రూర మృగాలకు దగ్గరగా వెళ్లి ఏకంగా ఫోటోలు వీడియోలు తీయడం లాంటివి చేసి ఆ థ్రిల్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సఫారీ కి వెళ్లి అడవి జంతువులను దగ్గర నుంచి చూడటం అంటే సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది అని చెప్పాలి.



 అయితే ఇలా సఫారీ కి వెళ్లి అడవి జంతువులను వాహనంలో అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇక పులి, సింహం లాంటి క్రూర మృగం ఏదైనా ఇక తమ వాహనం వైపు దూసుకు వచ్చింది అంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం ఇక ఆ వాహనంలో ఉన్న వారి వంతు అవుతుంది. కానీ ఇలాంటివి దాదాపు జరగవు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఒక భారీ సింహం సఫారీ వాహనం లోకి దూకింది.



 అయితే ఇలా సఫారీ వాహనంలోకి దూకిన సింహం అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకపోవడం గమనార్హం. ఇక ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులు అందరిపై ఆ సింహం దూకుతూ కాసేపటికి వాహనం దిగిపోయింది. ఇక ఈ దృశ్యాన్ని మొత్తం వాహనంలో కూర్చుని ఒక వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా సింహం సఫారీ లోకి దూకిన సమయంలో అక్కడ ఉన్న టూరిస్టులు భయపడటం కాదు ఏకంగా పెంపుడు కుక్కను నిమిరినట్లుగా  సింహాన్ని బుజ్జగించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: