ఫోన్ చూసేందుకు ఏనుగు కష్టాలు.. చూస్తే నవ్వాగదు?
ఇక ఎన్నో పెంపుడు జంతువులు మొబైల్ ని చూస్తూనే కాలక్షేపం చేస్తున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్. ఇక ఇప్పుడు ఒక ఏనుగు కూడా మొబైల్ కి ఎంతగానో బానిసగా మారిపోయింది అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో లో చూస్తే అర్థమవుతూ ఉంది. ఏకంగా ఒక వ్యక్తి ఒకచోట కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న ఏనుగు ఆ మొబైల్ లో వీడియోని చూసేందుకు కష్టపడుతున్న తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుంది అని చెప్పాలి. కేరళలోని కుంభకోణం శ్రీ కుంభీశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఒక ఏనుగు తన సంరక్షకుడి ఫోన్ చూసేందుకు ఎంతగానో కష్టపడుతున్న వీడియో అందరిని అవాక్క అయ్యేలా చేస్తూ ఉంది.
ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే కుంభకోణం ఆలయ ప్రాంగణంలో ఒక మావటి వ్యక్తి ఒక చోట కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి అతను పెంచుకుంటున్న ఏనుగు వచ్చింది. ఈ క్రమంలోనే మావటి ఫోన్ చూస్తూ ఉండడానికి గమనించి ఆ ఏనుగు కూడా ఫోన్ చూసేందుకు ప్రయత్నించింది. ఇక ఏనుగు చాలా పెద్దది కావడంతో దానికి ఫోన్ కనిపించడం లేదు. దీంతో ఎంతో కష్టపడి వంగి వంగి చూడటానికి ప్రయత్నించింది అని చెప్పాలి. ఇలా ఇక ఈ వీడియోలో ఏనుగు ఫోన్ చూడటానికి పడుతున్న కష్టం చూసి నేటిజన్స్ అందరూ నవ్వుకుంటున్నారు. పాపం ఆ గజరాజుకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.