అవసరమా బ్రో.. పులి పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది?
కానీ పులితో పరాచకాలు ఆడితే మాత్రం చివరికి ప్రాణాల మీదికి వస్తుంది అన్న దానికి నిదర్శనంగా కూడా ఇప్పటివరకు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక్కడ కొంతమంది యువకులు చేసిన పని కాస్త ప్రస్తుతం విమర్శల పాలు అవుతుంది అని చెప్పాలి. కొంతమంది యువకులు అడవి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అడవిలో దూరంగా వారికి ఒక పులి కనిపించింది. దీంతో వెంటనే వారి వాహనాన్ని ఆపేశారు. సెలబ్రిటీలతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు వెంటపడినట్లు గానే ఇక పులితో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరగా వెళ్లారు యువకులు.
అయితే యువకులు ఇంత అతి చేస్తున్న అటు పులి మాత్రం పట్టించుకోకుండా దాని దారిన అది రోడ్డు దాటుతూ వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇది చూసిన నెటిజన్లు.. పులి పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది.. కానీ ఒకవేళ యువకులు చేసిన పనికి పులికి కోపం వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది అని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ అధికారి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ కామెంట్ చేశారు.