ఇద్దరమ్మాయిల ఫైటింగ్.. చూస్తూ ఎంజాయ్ చేసిన క్లాస్ మేట్స్?
ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది అమ్మాయిలు ఏకంగా అందరి మధ్యలోనే దారుణంగా గొడవ పడుతూ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల చిన్నచిన్న గొడవలు కారణంగా.. ఇంకొన్ని చోట్ల ఏకంగా ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం లాంటి ఘటనలు ఇప్పటికే వెలుగు చూసాం. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు మొదట ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.
ఇదంతా జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల మిగతా విద్యార్థులు అందరూ ఉన్నారు. అయితే వీరు గొడవ పడుతూ ఉండటం చూసి మిగతా విద్యార్థులు అందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. ఇలా వీరి గొడవను చూసి ఎంజాయ్ చేస్తున్న వారిలో ఒక విద్యార్థి సెల్ ఫోన్ లో ఇదంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్లో వెయిట్ మిషన్లో బరువు చూసుకునే విషయంలో మొదలైన వివాదం కొట్టుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.