వైరల్ : చదువుకోమని పంపిస్తే.. ఇదేందిది?

praveen
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తూ ఉంటుంది . ఇక ప్రేమలో పడిన వారు ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. అయితే తాము ప్రేమించిన వారికి ఇక ప్రపోజ్ చేయడానికి ఎంతో మంది కాస్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో సర్ప్రైజ్ ఇచ్చి ఇక తమ ప్రేమను వ్యక్త పరచాలి అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది స్టేడియంలో  అందరి ముందు ప్రేయసికి గ్రాండ్ గా ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్ గా మారిపోతూ  తెగ చెక్కర్లు కొడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇలాంటి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది.. ఇక ఈ వీడియోలో  గమనించినట్లయితే ఒకే క్లాస్మేట్స్ అయినా అమ్మాయి అబ్బాయి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ బయటికి చెప్పుకోలేదు. అబ్బాయి కాస్త ధైర్యం చేశాడు. అమ్మాయిని సర్ప్రైజ్ చేయడానికి ఒక పువ్వుతో ఆకస్మాత్తుగా ప్రపోజ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన యువతి చివరికి నవ్వుకుంటూ అబ్బాయి ఇచ్చిన పువ్వు ని ఎంతో ఇష్టంగా తీసుకుంటుంది.

 ఇక వీరిద్దరి ప్రపోజల్ కి సంబంధించిన వీడియో చూసి నేటిజన్లు అందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. అయితే పక్కనే ఉన్న మిగతా విద్యార్థులు ఇక సదరు అబ్బాయి తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టడం గమనార్హం. అయితే ఈ వీడియో పై నెటిజెన్లు కాస్త భిన్నంగా కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రేమ ఒక తీపి జ్ఞాపకం అంటూ ఈ వీడియో చూసి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటే.. స్కూలుకు వెళ్లి చదువుకోమని పంపిస్తే ఇలాంటి పనులు చేసి చివరికి విద్యార్థులు పెడదోవ పడుతున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: