మెట్రోలో అదిరిపోయే డ్యాన్స్ వేసిన చిన్నారి..వీడియో పై నెటిజన్లు ఫిధా..

Satvika
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.కొందరు పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.. ప్రజలు ట్రెండ్‌కి తగ్గట్టుగా వివిధ సోషల్ మీడియా ఛాలెంజ్‌లు చేస్తూ తమ వీడియోలను రికార్డ్ చేయడం ట్రెండ్‌గా మారింది..మొన్న ఓ యువతి డ్యాన్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో వీడియో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ఓ చిన్నరికి సంబంధించిన వీడియో..పర్ఫెక్ట్ రీల్‌ను రికార్డ్ చేయడానికి కొన్ని సహాసాలు కూడా చేస్తుంటారు. ఎలాగైనా సరే రాత్రి రాత్రే.. ఫేమస్‌ అయిపోవాలన్న పిచ్చి ప్రతి ఒక్కరిలోనూ బాగా పెరిగిపోతుంది. రీల్స్‌, షార్ట్స్‌ వంటి వీడియోలు రికార్డ్‌ చేసి నెట్టింట్లో అప్‌లోడ్‌ చేయడం జనాలకు కామన్‌ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోవటం మానేశారు. ఇష్టారీతిన బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.ఈ సారి ఢిల్లీ మెట్రోలో ఓ బాలిక చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్‌ వీడియోను తిన్లయ్‌ భూటియా ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. ఈ షార్ట్‌ క్లిప్‌లో తన ఫ్రెండ్‌ వీడియో రికార్డ్‌ చేస్తుండగా బాలిక మెట్రో లోపల డ్యాన్స్‌ చేస్తుండటం కనిపించింది. ఈ సన్నివేశం అంతటినీ మరో ప్రయాణీకుడు కెమెరాలో రికార్డు చేశారు..కాన్ఫిడెన్స్‌ అంటే ఇదేనని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు ఫిధా అవ్వడంతో పాటు కామెంట్లు చేస్తున్నారు.. మీరు ఆ వీడియోను చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: