కోతుల గుంపు దాడి.. కూతుర్ని రక్షించడం కోసం తండ్రి సాహసం?

praveen
ఇటీవలి కాలంలో కోతుల గుంపు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కోతులు చేస్తున్న రచ్చ కారణంగా జనాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు కోతుల బెడద నుంచి ఉపశమనం కల్పించేందుకు  ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల బెడద మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  దారిన పోయే వారిపై దాడులకు పాల్పడుతూ చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా తీసుకు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.

 కొన్నిసార్లు మనుషులపై దాడి చేయడమే కాదు కోతులూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోతులు ఎంత దారుణంగా వ్యవహరిస్తాయి అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్ లో కోతులు బాలికపై దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. మరో ఇంటి లోపలికి వెళ్లి దాక్కుంది. కూతురు అరుపులు విన్న తండ్రి పరిగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే పదుల సంఖ్యలో కోతులు గట్టిగా అరుస్తూ అతడిని చుట్టుముట్టాయి. అతడు మాత్రం ఏ మాత్రం భయపడకుండా కోతుల గుంపు ఎదుర్కొన్నాడు. అంతలో షాకింగ్ ఘటన ఆ కోతుల గుంపు లో నుంచి ఒక పెద్ద కోతి అతనిపై దూకి కింద పడేసి గాయపరిచింది.

 అయినప్పటికీ కూడా అతను భయపడకుండా తన కూతురిని రక్షించుకోవడం కోసం కోతులతో హోరాహోరీ పోరాటం సాగించాడు అని చెప్పాలి. కోతులు అన్నింటిని కూడా అక్కడి నుంచి తరిమేసిన తర్వాత తన కూతురిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక తన కూతురిని కాపాడుకోవడం కోసం బాలిక తండ్రి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: