వైరల్ : బస్సుపై గుర్రం పోస్టర్.. తల్లి అనుకొని పిల్ల గుర్రం ఏం చేసిందంటే?
ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. అయితే తల్లి ప్రేమ అనేది ఎంతో గొప్పది. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమను చాటి చెప్పే సంఘటనలు ఎన్నో జరిగాయి అని చెప్పాలి. ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూరులోని పాటి ఈశ్వర దేవాలయం సమీపంలో పదికి పైగా గుర్రాలు ఉన్నాయి. అక్కడ గడ్డి మేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాయి. అయితే వారం క్రితం ఆ గుర్రం మందలో నుంచి ఒక పిల్ల గుర్రం తప్పిపోయింది.
దీంతో ఎటు వెళ్లాలో తెలియక ఇక అక్కడే చుట్టుపక్కల తిరుగుతూ గడ్డి మేస్తూ ఉంది పిల్ల గుర్రం. అయితే పక్కనే వచ్చి ఒక బస్సు ఆగింది. ఆ బస్సు మీద గుర్రం ఫోటో ఉంది. అచ్చం ఆ పిల్ల గుర్రం లాగానే బస్సు పై ఫోటో ఉంది. అది చూసిన పిల్ల గుర్రం తన తల్లి అనుకుంది. కాసేపటి వరకు అక్కడే తిరుగుతూ కనిపించింది. అంతలోనే బస్సు మొదలై రోడ్డు మీద రయ్ రయ్యిమంటూ దూసుకుపోయింది. ఆ పిల్ల గుర్రం మాత్రం పట్టువిడవకుండా బస్సుతో పాటు పరుగెత్తింది. ఇది చూసిన ఎంతోమంది తల్లి దూరమైందని ఆ పిల్ల గుర్రం ఎంత బాధ పడుతుందో ఈ ఒక్క ఘటనతో అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.