వైరల్ : తల్లి ప్రేమ అంటే ఇదే.. ఏనుగు ఏం చేసిందో చూడండి?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా కూడా తమ పిల్లలకు ఎలాంటి అపాయం తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరు అనే చెప్పాలి. మనుషుల విషయంలోనే కాదు మూగజీవాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాని కొన్నిసార్లు మాత్రం అమ్మానాన్నలు చెప్పిన మాటలను పెడచెవిన పెడుతూ పిల్లలు. తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు.

 ఇక పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు పేరెంట్స్ వెన్నంటే ఉంటూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటూ ఉంటారు. సరైన దారిలో వెళ్లేందుకు పిల్లలకు పలు సూచనలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే గొప్పది ఏది లేదు అంటూ చెబుతూ ఉంటారు. అది మనుషులైన జంతువులు అయినా తల్లి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఎప్పుడు సింహాలు పులులు భయపడే అడవి జంతువులు తమ పిల్లల జోలికి వస్తే మాత్రం సింహాన్ని సైతం ఎదిరించేందుకు సిద్ధమవుతూ ఉంటాయి.

 ఇక్కడ సఫారి పార్కులో ఒక ఏనుగు తన చిన్నారి బిడ్డ పై చూపించిన ప్రేమ కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో లో భాగంగా సఫారి పార్క్ లో ఏనుగు దాని పిల్ల రోడ్డు దాటుతూ ఉన్నాయి. కొంత మంది టూరిస్టులు ఆ మార్గం లోకి వస్తారు. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగు టూరిస్టులను చూసి వారి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తల్లి ఏనుగు ప్రశ్నించి తొండంతో గున్న ఏనుగును వెనక్కి మల్లించింది అని చెప్పాలి. ఈ వీడియో లో తల్లి ప్రేమ చూసి ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: