నాన్నకు ప్రేమతో.. వధువు చేసిన డాన్స్ తో.. తండ్రి ఫిదా?
అయితే ఇప్పటివరకు కేవలం వరుడు మండపం లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో డాన్సులు చేయడం వధువు డాన్స్ చేస్తూనే పెళ్లి మండపానికి రావడం లాంటి వీడియోలు మాత్రమే వైరల్ గా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక పెళ్లికూతురు మాత్రం ఏకంగా తన తండ్రి ఇన్నాళ్లు తనపై చూపించిన ప్రేమను ఒక పాట రూపంలో చెబుతూ డాన్స్ రూపంలో చూపిస్తూ ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణం గా పెళ్లి అయ్యిందంటే చాలు అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి అత్తారింటికి ఎంతో భారంగా వెళుతుంటుంది పెళ్ళికూతురు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక మన ఇంట్లో ఉండదు అన్న విషయం తెలిసి ఆ తండ్రి పడే బాధ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తండ్రి పై తమకున్న ప్రేమను తెలియజేస్తూ వధువు తో పాటు ఆమె సోదరి కలిసి డాన్స్ చేసి తండ్రి కి అంకితం చేశారు. ఇక ఈ వీడియో మొత్తం ప్రతి ఒక్కరి మనసుని తాకుతుంది అని చెప్పాలి. డాన్స్ పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత ఎమోషనల్ అయినా ఆ యువతి తండ్రి వెంటనే వచ్చే కూతురిని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇక ఇది చూసిన వారు నిజంగా ఈ ఆలోచన ఎంతో గొప్పగా ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. navikproductionsandanavis1201 అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో వైరల్ గా మారింది