వైరల్.. లైవ్ లో అడ్డొచ్చిన ఈగను మింగేసిన న్యూస్ రీడర్?

praveen
ఇటీవల కాలంలో రిపోర్టర్లు విచిత్రంగా రిపోర్టింగ్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్లి ఏకంగా తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  అదే సమయంలో ఇక అటు  రిపోర్టింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే టీవీ లో లైవ్ న్యూస్ చెప్పే వాళ్ళు ఎప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పాలి.  మనసులో ఎలాంటి ఆలోచనలు రానివ్వకుండా తాము చెప్పాలనుకున్నది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు జరిగేటప్పుడు అయితే యాంకర్లు తడబడకుండా ఎంతో యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కొంతమంది యాంకర్లు ఒకవేళ లైవ్ న్యూస్ చదువుతున్న సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పట్టించుకోకుండానే ఇక ఎప్పటిలాగానే న్యూస్ చదవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు యాంకర్ల డెడికేషన్ కి హాట్సాఫ్ చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకునే యాంకర్ కూడా ఈ కోవలోకే వస్తుంది అని చెప్పాలి. లైవ్లో వార్తలు చదువుతుండగా ఆమెకు ఒక అసాధారణమైన సంఘటన ఎదురైంది. అయినప్పటికీ ఎక్కడ తడబడకుండా ఎంతో చాకచక్యంగా ప్రవర్తించింది సదరు న్యూస్ రీడర్.

 ఇలా లైవ్ లో యాంకర్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి నోటిలోకి ఈగా లేదా చిన్న కీటకం ప్రవేశించక లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కెనడాకు చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్  పర నాజర్ లైవ్ లో న్యూస్  చదువుతుండగా పాకిస్తాన్ లో  వర్షాల కారణంగా వచ్చిన వరదల తో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని వివరిస్తుంది. ఇలాంటి సమయంలో ఒక ఈగ ఎగురుతూ ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె నోట్లోకి ప్రవేశించి దీంతో లైవ్ లో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఏకంగా ఈగను మింగేసింది యాంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: