వైరల్ వీడియో : పులిని భయపెట్టిన ఎద్దు?

praveen
సాధారణంగా అడవుల్లో ఉండే క్రూరమృగాల సింహాలు పులులు లాంటివి  పెద్ద పెద్ద జంతువులను  సైతం ఎంతో అలవోకగా వేటాడటం లాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది భారీ ఆకారం ఉన్న జంతువులను కూడా పులులు సింహాలు ఎలా వేటాడుతున్నాయి అని. కానీ  ఈ వేట వెనక దాగి ఉంది భయం అనే చెప్పాలి.  ఒకవైపు సింహాలు వేటాడగలం  ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటే భారీ ఆకారం ఉన్న అడవి దున్న లు సైతం పులులు సింహాలు చేతికి చిక్కితే ప్రాణాలు పోతాయని భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే భయపడటం మానేస్తాయో  అప్పుడు పులులు సింహాలు కు సైతం ఎదురు తిరగడం మొదలు పెడతాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.  తన తోటి  స్నేహితులను.. పిల్లలను  సింహాలు ఆహారం గా మార్చుకుంటూ ఉంటే అటు సింహాలు వేటాడతాయ్ అని తెలిసి కూడా ఎంతో ధైర్యంగా ముందుకు  వెళ్లి కొమ్ములతో సింహలనే  గాల్లోకి ఎగరేసిన ఘటనలు ఇప్పటివరకు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.  అది సరే గానీ ఇప్పుడు ధైర్యం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.  ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు  అన్నది అందరికీ అర్థమవుతుంది.

 సాధారణంగా పులులు సింహాలు వేటాడటానికి వచ్చినప్పుడు భారీ ఆకారం ఉన్న అడవి దున్నలు ఎద్దులు లాంటివి భయపడి పారి పోవడం మాత్రమే చూశాము.  కానీ ఇక్కడ వీడియోలు మాత్రం వేటాడటానికి వచ్చిన పులిని భయపెట్టింది ఒక ఎద్దు.  దీంతో ఇక ఆ ఎద్దు  ధైర్యానికి పులి సైతం వెనకడుగు వేసి పారిపోయింది. ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.. ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: