వైరల్ : పాపం గున్న ఏనుగు.. కింద ఉండలేక పైకి వెళ్లలేక.. చివరికి?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా నిమిషాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు కొన్ని అందరిని భయపెడుతూ ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఇక నెటిజన్ల మనసును కదిలించేలా ఉంటాయన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కి ఎన్ని రకాల వీడియోలు వచ్చిన అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే.

 ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్గా మారిపోతూ ఉంటుంది. దేశంలోని అడవుల్లో జంతువులు జీవన శైలి ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు మరో వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి. సాధారణంగా ఏనుగులు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ ఆకారంతో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. ఇంత భారీ ఆకారం ఉండడంతో ఏదైనా చిన్న గుంటలో పడిన కూడా ఏనుగులు పైకి ఎక్కడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి.

 ఇక్కడ ఒక చిన్న గున్న ఏనుగుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.   గున్న ఏనుగు చిన్న గుంతలో చిక్కుకుంది.. అది ఎలాగైనా ఇక ఆ గుంట నుంచి బయటకు రావాలని ఆ గున్న ఏనుగు ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం.  ఇలా లోపల ఉండలేక బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది.. వెంటనే అక్కడ ఉన్న ఆ గున్న ఏనుగు తల్లి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. ఈ క్రమంలోనే గుంతలోకి దిగి తొండంతో గున్న ఏనుగు ను పైకి లాగేసింది. ఇక ఆ తర్వాత ఆ పెద్ద ఏనుగుల వెంట చిన్న గున్న ఏనుగు వెళ్ళిపోయింది. ఈ వీడియో కాస్త నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: