వైరల్ : మీరు అమెరికాలో పుట్టారా.. ఇండియన్స్ పై జాత్యాహంకార దాడి?
టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. భారతీయ అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా అక్కడికి ఓ మహిళ వచ్చింది. మీ దేశానికి తిరిగి వెళ్ళిపొండి అంటూ దుర్భాషలాడటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వారిపై దాడిచేసి జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. నేను అమెరిక లో పుట్టాను.. ఇక ఇది నా దేశం.. మీరు అమెరికాలో పుట్టారా మీ దేశానికి వెళ్లిపోండి. నేను భారతీయులని.. ద్వేషిస్తున్నా అంటూ అసభ్య పదజాలాన్ని కూడా వాడింది. ఇటీవలే భారతీయ అమెరికన్ కమ్యూనిటీ లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వ్యక్తి అక్కడ జరిగిన సంఘటన గురించి వివరించారు. మా అమ్మ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళుతున్న సమయం లో మెక్సికన్ అమెరికన్ అయిన ఒక మహిళ అక్కడికి వచ్చి వారితో వాదనకూ దిగింది. జాత్యహంకార దూషణలు చేయొద్దని కోరినా కూడా ఆమె దారుణమైన పదజాలం తో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పాలి.