వైరల్ : యజమానితో మాట్లాడుతున్న ఏనుగు.. చూస్తే షాకే?
ఏనుగు కోపంగా ఉన్నప్పుడు పెద్దగా ఘింకరించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఎంతో మంది చూసే ఉంటారు. అయితే ఏనుగులు గట్టిగా అరవడం మాత్రమే కాదు తమ ప్రేమ వాత్సల్యాన్ని భిన్నమైన శబ్దాల ద్వారా చాటుతూ ఉంటాయి అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. తనని ఎంతో ప్రేమగా చూసుకునే యజమానుల పట్ల ఏనుగులు కూడా అంతే ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటాయి అన్నది ఈ వీడియోలో అర్థం అవుతుంది అని చెప్పాలి. ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియో లో ఒక ఏనుగు తన యజమాని పట్ల ఉన్న ప్రేమను శబ్దం రూపంలో వ్యక్తం చేయడం గమనించవచ్చు.
ఆ ఏనుగు యజమాని తన ఏనుగుతో ఏదో మాట్లాడుతున్న సమయంలో తనలో ఉన్న భావాలను కూడా శబ్దాలు రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తోంది ఏనుగు. ఈ క్రమంలోనే మనందరికీ తెలిసిన విధంగా కాకుండా కాస్త వింతగా అరవడం ఈ వీడియోలో అందరూ చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ జంతువు అయినా సరే తమ భావాలను ప్రేమను వ్యక్తపరచడానికి ఒక భాష ఉంటుంది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లక్కెయ్యండి.