శివలింగాన్ని చుట్టిన నల్ల త్రాచు.. నెట్టింట వైరల్!

Purushottham Vinay
భూమిని ఇంకా అలాగే ప్రకృతిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. ఈ సమస్త భూగోళమంతా కూడా ఎన్నో దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. పశు పక్షులు, జంతువులు ఇంకా అలాగే పాములు ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూసే నేచర్ మనది..ఇక అంతేకాదు ఆవు, నాగుపాము వంటి వాటిని కూడా పూజిస్తాం. నాగుపాముని దైవంగా భావించి నాగుల చవితి, నాగ పంచమి అంటూ వివిధ సందర్భాల్లో పండగలు చేసుకుంటూ పుట్టలో పాలు పోసి.. భక్తిభావంతో వాటిని మొక్కుతాం కూడా. శివుడి మెడలో కంఠాభరణంగా నాగుపాము ఇంకా విష్ణువు పాన్పుగా ఆదిశేషు ఇలా పాముల గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రస్తావనలో ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు అయితే పాములు.. ఆలయం వద్దకు వెళ్లి.. దేవుడి పూజ సమయంలో దర్శినమిచ్చిన వీడియోలు కూడా సర్వసాధారణంగా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ భారీ నల్ల తాచు పాము శివలింగాన్ని చుట్టుకుని.. పాలుని తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. అవును ఓ శివాలయంలో శివుడి మెడను చుట్టుకున్నట్లు శివలింగాన్ని చుట్టుకుని ఉందో భారీ నల్లతాచుపాము.


ఇక భక్తులు పాలతో అభిషేకం చేస్తున్న సమయంలో ఆ భారీ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది.అది భక్తులకు ఎలాంటి హానీ చేయకుండా శివలింగంపై పోసిన పాలను తాగుతూ శివలింగం వద్దే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతుంది.ఇక భక్తులు కూడా పాలను అత్యంత నెమ్మదిగా ఇంకా నన్నటి ధారలా పోస్తూ… ఆ పాముకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో పూజలను కూడా నిర్వహించారు. పాము పాలు తాగుతున్న దృశ్యం ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పురాణాలు అనేవి పాములు పాలుతాగుతాయి అంటే..ఆధునిక సైన్స్ మాత్రం పాములు పాలు తగవు అని అంటున్న సంగతి తెలిసిందే.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: