అయ్య బాబోయ్.. కొండచిలువ చెట్టు ఎలా ఎక్కిందో చూస్తే షాకే?

praveen
సాధారణంగా పాములు నేలపై ఎంతో వేగంగా పాకుతూ వెళ్తాయి అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకూ అందరూ కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఎన్నో సార్లు పాములను చూసి ఉంటారు. అయితే ఇక పాములు వేగంగా పాకడానికి సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. అయితే కొన్ని కొన్ని పాములు నేల మీద వేగంగా పాకుతూ వెళ్లడమే కాదు అటు చెట్ల పైకి కూడా అంతే వేగంగా ఎక్కడం లాంటివి చేస్తూ ఉంటాయి.. అయితే చిన్న చిన్న పాములు అయితే అలవోకగా చెట్లు ఎక్కేస్తూ ఉంటాయి. కానీ కొండచిలువ లాంటివి చెట్లు ఎక్కేందుకు సాహసం చేయవు అని చెప్పాలి.

 ఎందుకంటే కొండచిలువ శరీరం కాస్త పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇక అది చెట్ల మీదికి ఎక్కడానికి ఎంతో ఆపసోపాలు పడాల్సి ఉంటుంది. అందుకే చెట్ల మీదికి ఎక్కకుండా ఇక భూమి మీద ఉండే ఆహారాన్ని మాత్రమే సంపాదించుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక కొండచిలువ మాత్రం ఎంతో అలవోకగా ఒక చెట్టును ఎక్కేసింది. ముఖ్యంగా చెట్టు ఎక్కడానికి కొండచిలువ ఫాలో అయిన టెక్నిక్ మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది అని చెప్పాలి.

 సాధారణంగా దేన్నైనా  పట్టుకుంటే కొండచిలువ నిమిషాల్లో మింగేస్తూ తనకు ఆహారంగా మార్చుకుంటుంది అన్నది అందరికి తెలిసిందే. అయితే అటు భూమి మీదనే ఎంతో నెమ్మదిగా వెళుతూ ఉంటుంది కొండచిలువ. అలాంటిది ఇక సెకండ్ల వ్యవధిలోనే ఏకంగా ఒక భారీ చెట్టు ఎక్కుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.  శరీరాన్ని మొత్తం వేగంగా చెట్టుకు చుట్టేస్తూ వేగంగా పైకి ఎక్కుతూ కనిపించింది. ఇక ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: