చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదేనేమో.. రెప్పపాటులో?

praveen
చావు తప్పి కన్ను లొట్ట పోవడం అనే సామెత గురించి అందరూ వినే ఉంటారు. అయితే ఇలాంటివి కొంతమంది విషయంలో నిజమే అని అనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పెద్ద ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సినా వారు చివరికి చిన్న చిన్న గాయాలతో బయటపడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి జరిగినప్పుడే.. ఇలా ప్రమాదం నుంచి బయటపడిన వారికి భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉంది అని కొంతమంది.. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనయింది అంటూ మరికొంతమంది  కామెంట్ చేయడం చేస్తూ ఉంటాము. అయితే ఈ సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అంతేకాదు ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా లోకి వచ్చి ఎంతో మంది నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. కాగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలకు కొదవ లేకుండా పోయింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  ఒక యువతి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది. ఇలాంటి సమయంలో ఆ యువతి  చావు అంచులు వరకు వెళ్లి చివరికి ప్రాణాలతో బయట పడింది. ఇది విదేశాల్లో జరిగింది అన్న విషయం తెలుస్తుంది. అయితే లొకేషన్ ఎక్కడ అన్నది మాత్రం వివరాలు తెలియరాలేదు.

 ఈ వీడియో కేవలం మూడు సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ ట్విట్టర్ వేదికగా మాత్రం తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ఒకసారి చూసుకుంటే.. ఒక యువతి ఎప్పటిలాగానే రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. ఇలాంటి సమయంలోనే ఒక లారీ టైర్ ఆ యువతి వైపు దూసుకొచ్చింది. అయితే అది గమనించిన యువతి వెంటనే ఆ టైర్ తనకు తగలకుండా తప్పించుకుంది.  కానీ ఆ యువతికి మాత్రం బ్యాడ్లక్ వెంటాడింది. వెనకాల ఉన్న ఒక రాడ్ కి తగిలిన టైరు మళ్లీ రివర్స్ లో యువతిని వెనకనుంచి బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా యువతి కిందపడిపోయింది. ఈ ఘటనలో తలకు  గాయంతో బయటపడింది ఆ యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: