చిన్నారి ప్రేమ బంధం.. హృదయాలను హత్తుకునే వీడియో?

praveen
చిన్న పిల్లలు దేవుడితో సమానం అని చెబుతూ ఉంటారు. అందుకే  చిన్న పిల్లలు చూపించే ఆప్యాయత ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు. ముఖ్యంగా  మనుషుల్లో కూరుకుపోయిన కుళ్లు కుతంత్రాలు చిన్నపిల్లలు చూపించే ప్రేమ లో ఎక్కడా కనిపించవు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు ఏం చేసినా అది ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల బంధం అయితే ఎంత ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చెప్పాల్సిన పని లేదు. చెల్లికి ఏదైనా దెబ్బ తగిలింది అంటే చాలు ఏకంగా సినిమాల్లో హీరో లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నయ్య. చిన్న వయసులోనే నేను ఏమైనా చేయగలను అన్నట్లుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటాడు.

 ఇలా అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు మధ్య ప్రేమ అనుబంధానికి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసు పులకరించి పోతుంది. ఇలా చిన్నచిన్న విషయాలకే అన్న చెల్లెలు గొడవపడటం దగ్గరి నుంచి  ఒకరి కోసం ఒకరు ప్రేమను చూపించుకునేంత వరకు కూడా అన్నా చెల్లెలు బంధం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రస్తుతం అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందో అన్న దానికి నిదర్శనంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఈ వీడియోలో చూసుకుంటే ముందుగా చిన్నారి సోదరీ బాస్కెట్బాల్ ను బాస్కెట్ లో వేయాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ బాల్ కిందపడి ఆమె ముఖానికి తగులుతుంది. దీంతో ఆ చిన్నారి ఏడవడం మొదలు పెడుతుంది. పక్కనే ఉన్న అన్న చెల్లిని ఓదారుస్తూ నువ్వు ఇలా ఏడవకూడదు నువ్వు చాలా స్ట్రాంగ్ అంటూ చెబుతూ మరోసారి ప్రయత్నించు అంటూ బాల్ చెల్లి చేతికి తెచ్చి ఇస్తాడు. చెల్లిని ఒకసారి పైకి ఎత్తుకుంటాడు.  ఇక చెల్లి బాస్కెట్ లో బాల్ వేసి ఎంతో ఆనంద పడి పోతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరూ మనసుని తాకుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: