వీడి ధైర్యం తగలెయ్య.. కింగ్ కోబ్రాకే నీళ్లు తాగించాడు?

praveen
సాధారణంగా పాము అని పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు అనే విషయం తెలిసిందే. వెళ్లే దారిలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అది విషపూరితమైన పాము అని తెలిస్తే ఆ భయం మరింత ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. అయితే ఇలా విషపూరితమైన పాము మన వైపే వస్తూ ఉంటే గుండె జారి పోయినంత పని అవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషపూరితమైన పాములలో ఎంతో భయంకరం గా ఉండటమే కాదు ఎంతో ప్రమాదకరమైన పాము ఏది అంటే అందరూ కింగ్ కోబ్రా అని చెబుతూ ఉంటారు.

 సాధారణంగా కింగ్ కోబ్రా కి సంబంధించిన ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది చూసి భయపడిపోతుంటారు ప్రతి ఒక్కరు. అలాంటి కింగ్ కోబ్రా తో ఆట ఆడాలని ఎవరు అనుకోరు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది కింగ్ కోబ్రా ని ఎంతో అలవోకగా పట్టుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోని ఒక్కటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా కింగ్ కోబ్రా ని చూసి అతను భయపడలేదు. భారీ ఆకారం కలిగిన  కింగ్ కోబ్రా కి ఏకంగా మంచినీళ్లు తాగించాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే కింగ్ కోబ్రా దాదాపు ఆరడుగుల కి పైగానే పొడవు ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన పాము కు గ్లాసులో నీళ్ళు పట్టిస్తున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. గ్లాస్ లో నీళ్లు తాగుతున్న కింగ్ కోబ్రా కెమెరా వైపు ఒక లుక్కేసింది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. కింగ్ కోబ్రా కి నీళ్ళు తాగించాడు అంటే అతను మామూలు మనిషి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్లు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: