మందు కొట్టిన మేక.. నీ యవ్వ తగ్గేదేలే అంటుందిగా?

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలు మూలల్లో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాలు వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాము ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఏదైనా ప్రత్యేకమైన ఘటన జరిగిందంటే దానిని వీడియో తీసి ఎంతోమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. కాగా ఇటీవల ఎన్నో రకాల వీడియోలు నెట్లో తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి.

 ఇలా సోషల్ మీడియా లోకి వచ్చిన కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యానికి లోను చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. సాధారణంగా ఎంతోమంది మందుబాబులు మద్యం తాగక ముందు ఒకలా మద్యం తాగిన తర్వాత మరోలా కనిపిస్తూ ఉంటారు. ఒక పెగ్గు లోపలికి వెళ్ళింది అంటే ఇక తమ కంటే తోపు ఎవరూ లేరని.. కొండలను కూడా పిండి చేయగలుగుతాము అన్న విధంగా ప్రవర్తించడం చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మేక కూడా ఇలాగే ప్రవర్తించింది.

 సాధారణంగా మేకలు ఆకులు అలములు తింటూ జీవనం సాగిస్తూ ఉంటాయి. ఒకవేళ దాహం వేసింది అంటే నీళ్లు తాగడం చేస్తూ ఉంటాయి. ఇక మనుషులను చూస్తే కాదు పెద్ద జంతువులను చూసినా కూడా భయపడి పోతూ ఉంటాయి.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా గుక్క పెట్టకుండా మందు బాటిల్ తాగేసింది మేక. ఇంకేముంది ఫుల్లుగా మత్తు ఎక్కింది. దీంతో తాను ఒక బాహుబలి అని ఊహించుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా లో రానా ఒక పెద్ద దున్నపోతు తో పోరాడినట్లు గానే ఇక్కడ ఒక చిన్న మేక ఎద్దు తో పోటీకి సిద్ధమైంది. ఏకంగా ఎద్దు నే భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: