Viral: నగ్నంగా రన్వీర్ సింగ్.. ఆయనే కారణం!

Purushottham Vinay
ప్రస్తుతం బోల్డ్‌నెస్‌కు పూర్తిగా అర్థం అనేది మారుతోంది. షాకింగ్ లుక్స్‌లో కనిపించి అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఒకప్పుడు ఈ బోల్డ్‌ ఫొటోలు అంటే కేవలం హీరోయిన్లకు మాత్రమే అనే అభిప్రాయం ఉండేది.అయితే ప్రస్తుతం హీరోలు కూడా ఇదే ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నారు. మొన్నటి మొన్న విజయ్‌ దేవరకొండ లైగర్‌ చిత్రంలో భాగంగా బోల్డ్‌ లుక్‌ పోస్టర్ లో కనిపించి ఒక్కసారిగా అందరినీ కూడా పెద్ద షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన రణ్‌వీర్‌ సింగ్ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాడు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అసలు పూర్తిగా నగ్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్‌ అగ్ర హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్‌ సింగ్ తాజాగా పేపర్‌ అనే ఓ మ్యాగజైన్‌కు న్యూడ్‌ పోజులిచ్చాడు. శరీరంపై కనీసం నూలు పోగు కూడా లేకుండా ఉన్న ఈ స్టిల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

 ప్రముఖ అమెరికన్‌ యాక్టర్‌ బర్ట్ రేనాల్డ్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని రణ్‌వీర్‌ సింగ్ ఈ ఫొటో షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. నగ్నత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా రణ్‌వీర్‌ సింగ్ ఈ మ్యాగజైన్‌తో పంచుకున్నారు.ఇక ఈ సందర్భంగా రణ్‌ వీర్‌ మాట్లాడుతూ.. 'మనలోని ఆత్మే అసలైన నగ్నత్వం. నేను వెయ్యి మంది ముందు కూడా ధైర్యంగా నగ్నంగా ఉండగలను. అందులో ఇక నాకు ఎలాంటి సిగ్గు లేదు' అంటూ బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలను ఒక రేంజిలో షేక్‌ చేస్తున్నాయి. రణ్‌వీర్‌ ఇలా న్యూడ్‌గా కనిపించడంపై పలువురు అయితే నెగిటివ్‌గా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం అతని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. మరి ఈ ఫొటో షూట్‌ వ్యవహారం ఎలాంటి చర్చకు దారి తీస్తుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: