వైరల్ : బీరు తాగిన కోడిపుంజు.. తర్వాత ఏం చేసిందంటే?

praveen
కల్లు తాగిన కోతి చిత్ర విచిత్రంగా   ప్రవర్తిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా కల్లు తాగిన కోతి అనే పదం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగానే కోతి ఎలాంటి చేష్టలు చేస్తుందో.. అందరికీ తెలుసు. అందుకే ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే కోతి చేష్టలు చేస్తున్నాం అంటూ తిట్టడం  కూడా చేస్తూ ఉంటారు. అలాంటి కోతి కళ్ళు తాగితే ఇక ఆ మత్తులో ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాని విధంగానే ఉంటుంది. అయితే కేవలం కోతి మాత్రమే కాదు మిగతా జంతువులు పక్షులు కూడా నీళ్లకు బదులు మత్తు పానీయాలు తాగుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటిది ఇప్పటి వరకు ఎన్నో సార్లు జరిగాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇది చూసి నవ్వుకోవడం నెటిజన్ల వంతు అవుతుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా కోడిపుంజు బీరు తాగేసింది. సాధారణంగా కోడిపుంజు దాహం వేసింది అంటే చాలు ఇక దగ్గరలో ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయా లేవా అనే విషయాన్ని గమనించి అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక కోడిపుంజు మాత్రం ఏకంగా నీళ్లు అనుకుని బీరు తాగేసింది. ఇక బీరు ఒక గ్లాసులో పోసుకొని యజమాని తాగడానికి సిద్ధమయ్యాడు. పంతులు ఎవరో పిలిచినట్లు అనిపించడంతో పక్కకు వెళ్లాడు.

 ఇది గమనించిన కోడిపుంజు బీరు తాగేసి రివ్వున  అక్కడినుంచి ఎగిరిపోయింది. అయితే బీరు తాగిన వెంటనే ఆ కోడిపుంజుకు మత్తు ఎక్కినట్టుంది. దీంతో  ఏ సినిమా లోని పాట గుర్తొచ్చిందో ఏమో రివ్వున ఎగురుకుంటూ వెళ్లి పోయింది ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా ఎంతో ఫన్నీగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. బీర్ల అమ్మకాలు పెరిగాయ్ అంటే ఏమో అనుకున్నాం ఇలా కోళ్లు కూడా బీరు తాగడం  పెరగడం మొదలుపెడితే పెరగకుండా ఎలా ఉంటాయి అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: