కప్పలకు విడాకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!

Satvika
కప్పలకు పెళ్ళి చేస్తారా..అవి దొరుకుతాయా..అసలు ఎలా చేస్తారు..ఎందుకు చేస్తారు..ఇలాంటి ప్రశ్నలు రావడం కామన్..కాస్త వివరాల్లొకి వెళ్ళి తెలుసుకుందాం..వర్షాలు ఎక్కువగా కురిస్తే, భారీ వర్షాలు కురిసి వరదలు ఉప్పొంగి గ్రామాలను ముంచేసే పరిస్థితి వస్తే 'పెళ్లి చేసిన కప్పలను విడదీస్తారు'. అంటే ఆ కప్పలకు విడాకులు ఇస్తారు. కప్పలకు పెళ్లి చేయటానికి వరణుడే కారణం..వాటికి విడాకులకు కూడా వరుణుడే కారణం కావటం వింతనే చెప్పాలి. ఇలాంటి వింత నమ్మకాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. కప్పలకు పెళ్లి చేయటం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇస్తారనే విషయం మాత్రం పెద్దగా తెలియదు. కానీ 'కప్పలకు విడాకులు' కూడా ఉన్నాయి..వినడానికి విచిత్రంగా ఉంది కదూ..అదేంటో వివరంగా తెలుసుకుందాం...

భారత దేశంలోని కొన్ని గ్రామాల్లో రెండు కప్పలను తెచ్చి వాటికి పెళ్ళి చేస్తారు.ఊరంతా వాటిని ఊరేగిస్తారు. ఆ తరువాత వాటిని దగ్గర్లోని చెరువులల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.. వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో.. కప్పలకు విడాకులు కూడా ఇస్తారు. ముఖ్యంగా భోపాల్ లో ఈ కప్పల విడాకుల పద్ధతి భలే వింతగా ఉంటుంది. రెండు కప్పలను పట్టుకుని వాటిలో ఆడకప్పకు ఓ రకం బట్టలు, మగ కప్పకు ఓ రకం బట్టలు వేస్తారు..ఆడ కప్పకు పసుపు కుంకుమ పెడతారు. కాసేపటికి వాటిని పెళ్లి చేసినప్పుడు ఒకే చెరువులో వదిలిస్తారు.విడాకుల తరువాత వేరు వేరు చెరువుల్లో వదులుతారు..

వర్షాలు అధిక శాతం కురిస్తె మాత్రం ఆ కప్పలకు పెళ్ళి చేసిన పెద్దలే ఆ కప్పలను విడదీస్తారు..ఎడతెరిపి లేకుండా కురిసే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు.. రెండు కప్పలను పట్టుకుని, స్థానిక సంప్రదాయాల ప్రకారం వాటికి విడాకులు ఇస్తారు. పెళ్లి సమయంలో రెండు కప్పలను ఒకే చెరువులో వదిలేస్తే.. విడాకుల ప్రక్రియలో మాత్రం.. రెండింటినీ వేరు వేరు చెరువుల్లో వదిలేసి విడదీస్తారు.. దాంతో వర్షాలు తగ్గుతాయని వారి నమ్మకం...ఇదండీ కప్పల విడాకుల వెనుక అసలు స్టోరీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: