చెల్లెలి కోసం బుడ్డోడి సాహసం.. మనసుకు హత్తుకునే వీడియో?

praveen
అన్న అంటే నాన్నలో సగం అని అంటూ ఉంటారు. ఇక అన్న చెల్లెలు బంధం ఎప్పుడూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అన్న చెల్లెలు పోట్లాడుకున్నా..  ప్రేమగా మాట్లాడుకున్నా ఎప్పటికీ చూడముచ్చట గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. పైకి చెల్లెలితో ఎప్పుడూ గొడవ పడుతు ఉండే అన్న మాత్రం చెల్లెలి కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. చెల్లెలికి ఏదైనా ఇష్టం అని తెలిస్తే  ఏం చేయడానికైనా సిద్ధపడి పోతుంటాడు అన్న. అందుకే అన్న చెల్లెలు మధ్య ఉన్న ప్రేమ బంధానికి సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చిన సూపర్ హిట్ సాధించాయి.

 ఇలా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలో కి వచ్చాయి అంటే చాలు ప్రతి ఒక్కరి ఆకర్షిస్తూ అందరి మదిని తాకుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అన్న చెల్లెల బంధం ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా రోడ్ల పై వరద నీరు పారుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూల్ కి వెళ్తున్న సమయంలో నీటిలో నుండి ఎలా నడవాలో తెలియక చెల్లెలు భయపడిపోతూ ఉంది. అదే సమయంలో అన్నా తన వీపుపై చెల్లిని మోసం చేస్తూ ఉంటాడు.

 ఇలా చెల్లెలిని వీపుపై మోసుకు వెళుతూ ఇక వరదనీటిని ఎంతో జాగ్రత్తగా దాటుతూ ఉన్నాడు.  చెల్లిని ఇలా రోడ్డు నుంచి వరద నీరు దాటించి  ఒడ్డుకు చేర్చాడు. ఈ వీడియో వైరల్ గా మారగా ఇది చూసిన ఎంతో మంది మనసు పులకరించి పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ బంధానికి ఏదీ సాటి రాదు అంటూ ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చిన ఇది మాత్రం ఎంతో నాచురల్ గా ప్రతి ఒక్కరి కదిలించేలా ఉంది అని చెప్పలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక సారి ఈ వీడియోపై లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: