దేవుడా..బొమ్మతో పెళ్ళి..ఆపై బిడ్డ కూడా..

Satvika
ప్రేమ ఎప్పుడూ ఎవరి మీద పుడుతుంది అనేది చెప్పడం కష్టమే.. ప్రెమించిన ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకొరు..పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండలేరు. అయితే ప్రేమ విషయంలో చాలా మంది సమాజం గురించి అస్సలు పట్టించుకోరు..వాళ్ళు అనుకున్నది మాత్రం చేస్తారు.అయితే ప్రేమ మనుషుల మధ్య పుడితే పెళ్ళి చేసుకున్న ఒక అర్థం ఉంటుంది.అలా కాకుండా మనిషి, బొమ్మ మధ్య ప్రేమ కలిగితే..వామ్మో అదేంది..ఎలా సాధ్యం అనే సందేహం రావడం సహజం..కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది..అసలు విషయాన్నికొస్తే..

బ్రెజిల్‌లోని 37 ఏళ్ల మహిళకు ఈ పదబంధం నిజం. తన తల్లి ఇంట్లో తయారు చేసిన రాగ్ బొమ్మతో ఆమె ప్రేమలో పడి, ఏకంగా వివాహం చేసుకుంది. తాజాగా, ఈ జంటకు ఒక పాప, అది కూడా ఓ బొమ్మ బిడ్డ ఉండటం విశేషం. నీడ్ టు నో నివేదిక ప్రకారం, మెయిరివోన్ రోచా మోరేస్ అనే మహిళకు ఆమె తల్లి కొన్నాళ్ల క్రితం మార్సెలో అనే బొమ్మను పరిచయం చేసింది. మోరేస్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి భాగస్వామి లేదని తెలుసుకున్న తర్వాత ఆమె తల్లి దానిని తయారుచేసింది. మోరేస్ కూడా తరచుగా తనకు డ్యాన్స్ పార్టనర్ లేడని ఇంట్లో బాధపడుతూ ఉండేది. "నాకు ఫర్రో డాన్సర్ లేకపోవడం వల్లనే ఈ బొమ్మ నా జీవితంలోకి వచ్చింది. నేను ఈ డ్యాన్స్ చేయడానికని ఫంక్షన్లకు వెళ్తాను కానీ ఎప్పుడూ నా డ్యాన్స్‌ భాగస్వామి దొరకలేదు "అని మోరేస్ నీడ్ టు నోకు చెప్పింది..

ఆ బొమ్మ తన జీవితంలోకి రాగానే తనకు అనుకున్నవి జరిగాయాని, దాంతో చాలా హ్యాపీగా ఉందని చెప్పింది.వాళ్లిద్దరూ ఇటీవల వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితం చాలా గొప్పగా ఉందని ఆమె చెప్పింది. అందరి భర్తల్లా ఈ బొమ్మ వాదించదు, కొట్టుకోవడం ఉండదు, ఎప్పుడూ తనని అర్థం చేసుకుంటుందని, తాను ఎప్పుడూ కోరుకున్న చక్కని జీవిత భాగస్వామి మార్సెలో మోరెస్సేనని ఆమె వివరించింది. "మార్సెలో గొప్ప, నమ్మకమైన భర్త. ఆడవాళ్ళందరూ అసూయపడేలాంటి వ్యక్తి అతడు, " అంటూ మురిసిపోతోంది. "నేను పెళ్లి మండపంలో నడిచిన క్షణం నుండి చివరి వరకు అది చాలా అందంగా ఉంది. అప్పుడు నా భర్త మార్సెలోతో కలిసి మొదటి రాత్రికి వెళ్లాను. మేమిద్దరం ఆ రోజును చాలా ఆనందించాము" అని చెప్పింది. ఇప్పుడు తాజాగా, ఈ జంట తమ కుటుంబంలోకి ఒక బిడ్డను కూడా ఆహ్వానించారు...ఆ ఘటనను చూడటానికి చాలా మంది వచ్చారు..ఏందో ఈ పిచ్చి ఎవరికీ అర్థం కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: