వారెవ్వా.. ఏం క్రియేటివిటీ.. వీడియో చూస్తే అవాక్కవుతారు?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణ కాల వ్యవధిలోనే  అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నాం. ఈ క్రమంలోనే ప్రపంచం నలుమూలల్లో జరిగిన వింత సంఘటనలు కూడా తెలుసుకుని ఆశ్చర్య పోవడం అందరి వంతు అవుతుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కొన్ని వార్తలు వీడియోలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.

 ఎప్పుడూ సోషల్ మీడియాలో భిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా ఇక తాజాగా మరో వీడియోను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు. ఇక ఈ వీడియో కాస్త తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ వీడియో చూసి నెటిజన్లు అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతలా వావ్ అనడానికి ఈ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఒక స్కూటర్ ఈ వీడియోలో కనిపిస్తోంది.

 ఇందులో పెద్దగా ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఒక వ్యక్తి తన దగ్గర  ఉన్న ఒక స్కూటర్ ని తన అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేయించుకున్నాడు. ఇక స్కూటర్ను ఎలక్ట్రిక్ వాహనం గా మార్చుకోవడమే కాదు చుట్టూ లైట్లు ముందు మొబైల్ డిజిటల్ వాచ్ స్పీకర్లు ఏర్పాటు చేయించుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారి పోవడం తో అటు ఆనంద్ మహేంద్ర ను తెగ ఆకర్షించింది. ఆనంద్ మహేంద్ర దీనిని పోస్ట్ చేయడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఉన్న స్కూటర్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మన దగ్గర ఎలాంటి వస్తూ ఉంది అన్నది కాదు ఆ వస్తువుని మనం ఎంత ఆస్వాదిస్తునాము అన్నదే ముఖ్యం అంటూ ఈ వీడియో ని చూస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: