బ్రాండ్ పిచ్చితో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

Satvika
డబ్బులు ఉంటే ఏదైనా చెయ్యొచు అని కొందరు అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం డబ్బులు లేకున్నా కూడా అందరి లో కన్నా రిచ్ గా కనిపించాలని అనుకుంటారు..వాళ్ళు అప్పులు చేసి అయిన గొప్పలు చెప్పుకోవడం చేస్తారు.అయితే ఇప్పుడు ఓ వ్యక్తి తనకూ బ్రాండ్ అంటే విపరీతమైన పిచ్చి ఉంది. దాంతో అతను ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అది కాస్త బయటకు పొక్కడంతో తను చేసిన పని బయటకు వచ్చింది.


కొందరు బ్రాండెడ్ దస్తులు, షూలు, వస్తువులపై అమితమైన ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తూ సంతోష పడుతుంటారు.ఇలాంటి మనస్తత్వం ఉన్న ఓ వ్యక్తి నైక్ బూట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బూట్లను కొనుగోలు చేసేవాడు. అయితే నెలల వ్యవధిలోనే మరిన్ని కొత్త కొత్త స్టైల్స్‌లో బూట్లు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు చేసిన పనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..


ఈ విషయం పై కాస్త వివరంగా తెలుసుకుందాం...బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి నైక్ బ్రాండెడ్ బూట్లంటే చాలా ఇష్టం. వాటిపై ఉన్న మక్కువతో కొత్త కొత్త స్టైల్స్‌లో షూలు మార్కెట్‌లోకి విడుదలైన వెంటనే వాటిని కొనుగోలు చేసేవాడు. అయితే.. అతడు కొనుగోలు చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మరికొన్ని కొత్త వేరియంట్ షూలు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో ఆర్థిక ఇబ్బుందులను సైతం పట్టించుకోకుండా వాటిని కూడా ఇంటికి తెచ్చేసుకునేవాడు. ఈ క్రమంలోనే విసిగిపోయిన అతడు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. నైక్‌ షూ వేసుకున్నాననే భావన పొందేందుకు.. అచ్చం అదే స్టైల్లో తన కాళ్లకు టాటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే యూకేలోని ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ డీన్ గున్థర్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాధను అర్థం చేసుకున్న ఆయన.. దాదాపు 8 గంటలపాటు శ్రమించి అతడి కాళ్లపై టాటూలు వేశాడు. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి..దాన్ని చూసిన అందరూ కూడా వింత వింత కామెంట్లు పెడుతూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: