ఇదేం పిచ్చిరా బాబు.. ఇలాంటి ఇల్లేంటి?

Satvika
ఇల్లు అంటే నేల మీద ఉంటే బాగుంటుంది.. కుటుంబం అంతా బాగుంటారు..కానీ ఆకాశంలో వేలాడుతూ ఉంటే మాత్రం చూసే వాళ్ళకు, అందులో ఉండే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకొనే ఒక ఇల్లు అలాంటిది.. చెట్లు, గుట్టలు పోయి ఇప్పుడు ఏకంగా పర్వతం మీద ఇంటిని నిర్మించాడు ఓ వ్యక్తి..అది అందరినీ భయంతో వణికిస్తుంది.ఎక్కడ కింద పడిపోతుందో అని అందరినీ ఆలోచనలో పడవేసింది..ఆ ఇంటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఆస్ట్రేలియాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త విభిన్నమైన అభిరుచి గలవాడు. తాను ఏం చేసినా స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. అందులో భాగంగానే.. తన నివాస గృహం కూడా చాలా స్పెషల్‌గా ఉండాలని భావించి.. అందుకోసం ప్రణాళికలు రచ్చించాడు. ఏమాత్రం ఆలోస్యం చేయకుండా మాంచి ప్లేస్ వెతకడం ప్రారంభించాడు. అయితే, అతను సెలక్ట్ చేసి ప్రాంతం ఏంటో తెలిసాక.. సామాన్యుల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే.. ఎవరూ ఊహించని ప్లేస్‌లో ఇంటి నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యాడు. సాధారణంగా సముద్రం ఒడ్డున ఇల్లు ఉండాలని, సన్ రైస్‌ను చూడాలని అందరూ ఇష్టపడుతారు. ఇతను కూడా అలాగే భావించాడు. అయితే, ఇంకాస్త భిన్నంగా ఉండాలని భావించాడు. ఇంకేముంది.. సముద్రం ఒడ్డున ఉన్న ఓ భారీ కొండ అంచున ఇల్లు నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యాడు...


కింద సముద్రం ఉంటుంది.. పైన ఆకాశం ఉంటుంది. ఇల్లు మాత్రం కొండ అంచున సముద్రంలో వేలాడుతున్నట్లుగా ఉండాలి. ఇదీ అతని ప్లాన్. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ ప్లేస్‌లో ఇల్లు కట్టేందుకు ఓ ఆర్టిటెక్ సంస్థను కలిశారు. ఆస్ట్రేలియా ఆర్కిటెక్చర్ సంస్థ మోడ్‌స్కేప్ సంస్థ అతను కోరిన విధంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సై అంది. అత్యాధునిక టెక్నాలజీలో ఈ ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు.మొత్తం గాలిలో వేలాడుతూ ఉన్న ఆ ఇంట్లో ఐదు అంథస్తులు ఉన్నాయి.పై ఫ్లోర్ మొత్తం కూడా కారు పార్కింగ్‌ కోసం సెట్ చేశారు. మిగిలిన నాలుగు ఫ్లోర్లలో బెడ్‌ రూమ్, వాష్ రూమ్, కిచెన్ ఉన్నాయి. ఈ ఇంటిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి భయంకరంగా ఉన్నా కూడా దానిని చూసిన వారంతా థ్రిల్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: