5 నెలల బాలుడు వర్కౌట్స్.. చూస్తే షాకే?

praveen
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను చూసే అన్ని విషయాలు నేర్చుకుంటూ అన్న విషయం తెలిసిందే. అందుకే తల్లిదండ్రులు ఎలా ఉంటే అటు పిల్లల నడవడిక కూడా అలాగే ఉంటుంది. అందుకే బయట ఎలా ఉన్నా పిల్లల ముందు మాత్రం ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల ఇక పిల్లలు కూడా అలాగే తయారవుతారు అని ఎంతోమంది చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తరువాత మాత్రం ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. పెద్దయిన తర్వాత కాదు ఏకంగా నెలల వయసు నుంచే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు అన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.Your browser does not support HTML5 video.
 ఇంతకీ ఏం జరిగింది అంటారా.. సాధారణంగా ఐదు నెలల వయస్సు ఉన్న బాలుడు ఏకంగా తల్లి కనిపించింది అంటే చాలు ఎంతో ఆనందంగా వెళ్లి తల్లి ఒడిలోకీ చేరుకుంటూ ఉంటాడు. లేదా ఏదైనా ఆట వస్తువుల తో ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు.  కానీ ఇక్కడ ఐదు నెలలు ఉన్న బాలుడు మాత్రం తల్లి వర్కౌట్స్ చేస్తూ ఉంటే అది చూసి తాను కూడా వర్కౌట్ చేయడానికి సిద్ధమై పోయాడు. ఇలా ఊహ తెలియకముందే ఐదు నెలల పిల్లాడు చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక తన తల్లిలాగే వ్యాయామం చేసేందుకు అనుకరించేందుకు ఎంతగానో కష్టం పడిపోయిన బాలుడు.. చివరికి తల్లి లాగే చేసి చూపించాడు. ఇక ఇది చూసిన తల్లి ఎంతగానో మురిసిపోయింది. ఇక దీనికీ సంబంధించిన వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక నెటిజన్లు అందర్నీ కూడా ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఐదు నెలల వయసులో ఆ బాలుడికి ఇంత తెలివి ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు ఎంతోమంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: