దేవుడా..చెప్పులు కోసం ఎంత హంగామా చేశాడు..
180 రూపాయలు పెట్టి ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు పోయాయని ఫిర్యాధు చేయడానికి పోలీసుల గడప తొక్కాడు.మొదట అతడు చెప్పిన మాటలు విని పోలీసులతో పాటుగా, అక్కడకు వచ్చిన జనాలు కూడా అతణ్ణి పిచ్చి వాడిలాగా చూసారు.ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది.అయితే మొదట్లో రైతు చెప్పిన మాటలు విన్న కొందరు పోలీసులు నవ్వుకున్నారు. చెప్పుల గురించి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ చేస్తారా అని ఆ రైతుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.అతను మాత్రం ఎక్కడ వినే ప్రయత్నం చేయలేదు.
ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. తన చెప్పుల చోరీ వెనుక కుట్ర ఉందని జితేంద్ర పోలీసులకు తెలిపాడు. “దొంగ నా చెప్పులను మరొక నేర స్థలంలో వదిలేస్తే ఆ నేరం రైతు అయిన నాపై పడుతుంది, ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని” రైతు జితేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర. అయితే రైతు చెప్పిన పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు సేకరించి, త్వరలో చెప్పులను ఎక్కడ ఉన్నాయో పట్టుకుంటామని తెలిపారు.మొత్తానికి ఈ ఘటన వైరల్ గా మారింది.